Telangana: నేటి నుంచే టెట్-2026 దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) -2026 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్...
By - అంజి |
Telangana: నేటి నుంచే టెట్-2026 దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) -2026 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. శుక్రవారం పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆన్‌లైన్‌లో ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. D.EI,Ed, D.Ed.,B.Ed, Language Pandit అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకూ, తిరిగి సాయంత్రం 2 గంటల నుంచి 4.30 వరకూ రెండు సెషన్లుగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
టెట్ అర్హత జీవితకాలం ఉంటుంది. టెట్‌లో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 60 శాతం, బీసీలు 50, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హతగా పరిగణిస్తారు. ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి. బీఈడీ విద్యార్హత కలిగిన ఎస్‌జీటీలు పేపర్- పరీక్ష రాయవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750 కాగా రెండు పేపర్లకు రూ.1000గా నిర్ధారించారు. పూర్తి వివరాలకు tgtet.aptonline.in/tgtet/ ను విజిట్ చేయండి.
రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ క్వాలిఫై అయి ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. టీచర్లు సర్వీస్‌లో ఉండాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 2009 తర్వాత నియమితులైన 30 వేల మంది టీచర్లకు ఈ నిబంధన వర్తించనుంది. రానున్న రెండేళ్లలో వీరంతా టెట్ పాస్ కావాలని అధికారులు తెలిపారు.