తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ - 2 పరీక్షలకు జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో, పేపర్ - 1 పరీక్షలను 8, 9, 10, 18 తేదీల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు 2,48,172 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వీరికి ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండు సెషన్లు పరీక్షలు ఉండనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒక్కసారి టెట్ ఉత్తీర్ణత అయితే లైఫ్ టైమ్ చెల్లుబాటు అవుతుంది.