భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌

తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి.

By అంజి
Published on : 31 Aug 2025 5:00 PM IST

Telangana, Survey map, land registration

భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌

తెలంగాణలో భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ఈ సేవలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే రాష్ట్రంలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్‌ ఆధారంగానే జరగనున్నాయి. రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ వంటి ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులను కూడా తీసుకువచ్చింది. ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు కావాలంటే సర్వే మ్యాప్‌ తప్పనిసరి కానుంది.

సర్వే మ్యాప్‌ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని చట్టంలో పొందుపరిచారు. దీంతో సర్వేయర్ల పాత్ర కీలకంగా ఉండనుంది. భూమి రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపిస్తారు. మ్యాప్‌ తయారు చేస్తారు. ఇందుకుగాను అధిక సంఖ్యలో సర్వేయర్లు అవసరమని సర్కార్‌ భావించింది. దీంతో ఇందుకు అవసరమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను అక్టోబర్‌ 2 గాంధీ జయంతి నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడత సర్వేయర్ల శిక్షణ పూర్తైందని ప్రభుత్వం ప్రకటించింది.

సర్వే మ్యాప్‌లో సదరు భూమి యొక్క హద్దులను వివరంగా పొందుపరుస్తారు. విక్రయించే భూమి లేదా హక్కుల మార్పిడి భూమి విస్తీర్ణంతో పాటు ప్రతి అంశాన్ని ఇందులో వివరిస్తారు. మ్యాప్‌ను జత చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. సర్టిఫైయిడ్‌ సర్వేయర్‌ ద్వారానే ఈ ప్రక్రియను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Next Story