తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు వేళాయె అంటున్నారు. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈనెల 20 నుంచి రెండు రోజుల పాటు గ్రేటర్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడడంతో.. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు వడదెబ్బకు గురై మృతిచెందారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతలకు భయపడి జనం బయటకు రావటం లేదు. జంట నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల సమయంలో గ్రేటర్‌లో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.