తెలంగాణ పోలీసులు 206 రోజుల్లో 21,293 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేశారు. ఈ ఏడాది జనవరి నుండి జూలై మధ్య, దేశంలో మొబైల్ ఫోన్ రికవరీ చేసిన రాష్ట్రంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్‌ను ఏప్రిల్ 19, 2023న ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 780 పోలీస్ స్టేషన్ లలో 37,000 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేశారు. 35,945 మొబైల్స్‌తో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. గత సంవత్సరంలో మహారాష్ట్ర లో 15,426 మొబైల్ ఫోన్స్, , ఆంధ్రప్రదేశ్ లో 7,387 ఫోన్ల రికవరీలతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
ఈ సంవత్సరం తెలంగాణ పోలీసులు రోజుకు 102 మొబైల్ ఫోన్‌లను రికవరీ చేయడం విశేషం. హైదరాబాద్ కమిషనరేట్ రికవరీలో భాగంగా 3808 ఫోన్ లను విజయవంతంగా ఓనర్లకు అందజేసింది. రాచకొండ కమిషనరేట్ 2174 డివైజ్ లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2030 డివైజ్ లు రికవరీ చేశారు. పోగొట్టుకున్న/తప్పిపోయిన మొబైల్ పరికరాలను నివేదించడానికి www.tspolice.gov.in లేదా www.ceir.gov.in పోర్టల్‌ని ఉపయోగించాలని తెలంగాణ పౌరులను పోలీసులు కోరుతున్నారు.