ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు

తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించి.. విద్యాసంస్థలు, ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

By అంజి  Published on  8 Feb 2024 12:42 AM GMT
Telangana, holiday, educational institutions, government offices, Shab E Meraj

ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు

తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న పబ్లిక్‌ హాలిడేగా ప్రకటించి.. విద్యాసంస్థలు, ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ముస్లింల జరుపుకునే షబ్‌-ఎ-మెరాజ్‌ పండుగ సందర్భంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా సెలవు ఉండనుంది. గతంలో ఇది ఆప్షనల్‌ హాలీడేగా ఉండేది.. కాగా ఇటీవల సాధారణ సెలవుగా ప్రకటించారు. దీంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇవాళ మూతపడనున్నాయి. అటు ఏపీలో షబ్‌-ఎ-మెరాజ్‌ ఆప్షనల్‌ హాలీడేస్‌ జాబితాలో ఉండటంతో కొన్ని చోట్ల మాత్రమే స్కూళ్లకు సెలవు ఉంటుంది. మిగతా చోట్ల యథావిధిగా స్కూళ్లు, కాలేజీలు ఉండనున్నాయి.

షబ్-ఎ-మెరాజ్ పండుగను ముస్లింలు పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు మసీదులను దీపాలతో అందంగా అలంకరించి, రాత్రంతా జాగారం చేసి అల్లాకు ప్రార్థనలు చేస్తారు. మసీదుల్లో ఈ రోజు ఇస్రా, మేరాజ్‌ల కథను చెబుతుంటారు. ముస్లింలు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఈ పండగ రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో ఆ వర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత ఈ నెలలో సాధారణ సెలవులు లేవు.

Next Story