తెలంగాణలో ఈనెల 26న స్కూళ్ల బంద్‌కు ABVP పిలుపు
తెలంగాణలో ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు..
By Srikanth Gundamalla Published on 24 Jun 2023 10:17 AM GMTతెలంగాణలో ఈనెల 26న స్కూళ్ల బంద్‌కు ABVP పిలుపు
తెలంగాణలో ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని.. కార్పొరేట్ స్కూల్ మాఫియాను అరికట్టి, ఫీజు నియంత్రణ చట్టం కోసం స్కూళ్ల బంద్‌కు ఏబీవీపీ నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కమల్ సురేశ్ మాట్లాడారు.
తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే స్కూల్ రీఓపెన్ అయ్యి 10 రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మౌలిక వసతులు కల్పించడం లేదని కమల్ సురేశ్ అన్నారు. కొన్ని స్కూళ్లలో అయితే ఉపాధ్యాయులు లేక వెలవెలబోతున్నాయని అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల మాని.. పేద విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వ స్కూళ్లపై దృష్టి పెట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పించి.. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పారు. తెలంగాణలో పలు ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయన్నారు కమల్ సురేశ్. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి మనబస్తి మన బడి స్కీమ్ పనులను ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రారంభించాలని అన్నారు. ఈ సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అందుకే జూన్ 26న స్కూళ్ల బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు. ఈ క్రమంలో అందరూ బంద్‌లో పాల్గొని.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కమల్ సురేశ్ కోరారు.