Telangana: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త

తెలంగాణలో జూన్‌ 12వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  30 May 2024 6:57 AM IST
Telangana,  students, textbook rate, state govt,

Telangana: విద్యార్థుల తల్లిదండ్రులకు శుభవార్త

తెలంగాణలో జూన్‌ 12వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి. దాంతో..విద్యార్థులకు కావాల్సిన టెక్ట్స్ పుస్తకాలు.. ఇతర నోట్‌ బుక్స్‌ కొనడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫోకస్ పెడతారు. మధ్యతరగతి, పేద కుటుంబాలు తమకు కష్టంగా ఉన్నా పిల్లలను ప్రయివేట్‌ స్కూళ్లలో చదివిస్తుంటారు. ఇలాంటి వారికి టెక్ట్స్‌ పుస్తకాలను కొనడం కొంతకాలంగా భారంగా మారింది. ఎందుకంటే ఏటా పుస్తకాల ధరలు పెరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త విద్యా సంవత్సరంలో అన్ని మీడియాలకు చెందిన టెక్ట్స్ పుస్తకాల ధరలు తగ్గబోతున్నాయని వివరించింది ప్రభుత్వం. ఒక్కో పుస్తకంపై రూ.10 నుంచి ర.74 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. రెవెన్యూ పెంచడానికి వీలైన అన్ని మార్గాలను చూస్తోంది. రకరకాల మార్గాల్లో ఆదాయం వచ్చేలా చూస్తోంది. ఇక విద్యార్థుల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా విద్యార్థుల తల్లిదండ్రులపై పడుతున్న ఈ టెక్ట్స్‌ పుస్తకాల భారాన్ని కాస్త తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్కెట్‌లో పేపర్‌ రేటు తగ్గిపోవడంతో.. పుస్తకాల ధరలు కూడా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్కో క్లాస్‌ బుక్స్‌ ధరలపై తల్లిదండ్రులకు రూ.200 నుంచి రూ.300 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అదే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.500 నుంచి రూ.600 వరకు డబ్బులు ఆదా అవుతాయ్..! ఇక తగ్గుతున్న టెక్ట్స్‌ పుస్తకాలను ఎలా పొందాలే విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా స్కూళ్‌ టీచర్లను అడిగి ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తున్నాయనేది చూసుకోవడం కూడా ముఖ్యమే..!

Next Story