Telangana: వారికి మాత్రమే రైతు భరోసా.. నేడు సీఎం చేతికి సబ్‌ కమిటీ రిపోర్ట్‌

వ్యవసాయ భూములు చురుగ్గా సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఏటా ఎకరాకు రూ.15,000 ఆర్థిక సాయం అందించాలని రైతు భరోసా పథకంపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది.

By అంజి  Published on  3 Jan 2025 10:02 AM IST
Telangana, Rythu Bharosa , cultivated land

Telangana: వారికి మాత్రమే రైతు భరోసా.. నేడు సీఎం చేతికి సబ్‌ కమిటీ రిపోర్ట్‌

హైదరాబాద్: వ్యవసాయ భూములు చురుగ్గా సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ఏటా ఎకరాకు రూ.15,000 ఆర్థిక సాయం అందించాలని రైతు భరోసా పథకంపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది. అటువంటి వ్యవసాయ భూములను ఖచ్చితంగా గుర్తించేందుకు రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. తెలంగాణ రైతులకు సంక్రాంతి కానుకగా జనవరి 14న పునరుద్ధరించిన రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టాలని కమిటీ ప్రతిపాదించింది.

రైతు భరోసా పొందేందుకు ప్రభుత్వం రైతుల నుంచి దరఖాస్తులు కోరాలని, జనవరి 5 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి అర్హులను వెరిఫికేషన్‌ ద్వారా నిర్ణయించాలని కమిటీ సిఫార్సు చేసింది. సబ్ కమిటీ నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అందించనున్నారు. శనివారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమీక్షించబడుతుంది. ఆ సమీక్షలో అర్హత ప్రమాణాలు, మార్గదర్శకాలపై తుది నిర్ణయాలు తీసుకోబడతాయి. రైతు భరోసా అమలులో ముఖ్యమైన మార్పులను కమిటీ ప్రతిపాదించింది.

Next Story