తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..'CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' కొత్త మెనూ రెడీ

CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ (ముఖ్యమంత్రి అల్పాహార పథకం) కొత్త మెనూను సిద్ధం చేసింది.

By -  Knakam Karthik
Published on : 27 March 2026 10:55 AM IST

Telangana, CM Break fast Scheme, Govt Schools, Student Health, Millets

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..'CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్' కొత్త మెనూ రెడీ

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 19 లక్షల మంది విద్యార్థుల పోషకాహార అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘CM బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’ (ముఖ్యమంత్రి అల్పాహార పథకం) కొత్త మెనూను సిద్ధం చేసింది. ఈ పథకం అమలు కోసం ఏడాదికి ₹720 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, విద్యార్థులకు రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త మెనూ ప్రకారం వారంలో ఆరు రోజుల పాటు వైవిధ్యమైన అల్పాహారాలను అందిస్తారు.

సోమవారం దోశ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, బుధవారం పూరీ, గురువారం మళ్లీ మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్, శనివారం బోండా పంపిణీ చేస్తారు. వీటితో పాటు విద్యార్థుల ఎదుగుదలకు అవసరమైన కాల్షియం మరియు ప్రోటీన్లు అందించేందుకు సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు, అలాగే మంగళ, గురు, శనివారాల్లో శక్తినిచ్చే రాగి జావను ప్రత్యేకంగా చేర్చారు. ముఖ్యంగా చిరుధాన్యాలకు (Millets) ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ మెనూ ద్వారా విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించి, వారిలో ఏకాగ్రతను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. పాఠశాల ప్రారంభానికి ముందే విద్యార్థులందరికీ వేడివేడిగా ఈ అల్పాహారం అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Next Story