తెలంగాణలో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు
రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు 2021లో 6,675 కాగా, 2022లో 7,368 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనలో
By అంజి Published on 14 April 2023 11:02 AM ISTతెలంగాణలో పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు
హైదరాబాద్: రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు 2021లో 6,675 కాగా, 2022లో 7,368 అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనలో గతేడాది 2021లో 25 మంది మరణించగా, అగ్నిమాపక సిబ్బంది 2021లో 19 మంది ప్రాణాలు కోల్పోగా, గతేడాది 213 మంది ప్రాణాలు కాపాడారు. చాలా అగ్ని ప్రమాదాలు సిగరెట్లను అజాగ్రత్తగా పారవేయడం వలన సంభవించాయి. తరువాత షార్ట్ సర్క్యూట్లు, తప్పుడు విద్యుత్ కేబుల్స్, గ్యాస్ బొగ్గు కొలిమి, చిమ్నీల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి.
ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వి పాపయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖ రాష్ట్రంలో అగ్నిమాపక భద్రతను పెంపొందించేందుకు అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. 2022లో డిపార్ట్‌మెంట్ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40,000 అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అంతకుముందు సంవత్సరం కేవలం 10,000 అవగాహన కార్యక్రమాలు మాత్రమే నిర్వహించింది. అదే విధంగా 2022లో చేసిన తనిఖీల సంఖ్య మునుపటి సంవత్సరం 303 నుండి 432కి చేరుకుంది.
"సికింద్రాబాద్‌లోని దక్కన్ మాల్ కాంప్లెక్స్, స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల తరువాత, ఉమ్మడి తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. ఉల్లంఘనలను సరిదిద్దడానికి భవన యజమానులకు నోటీసులు జారీ చేయబడ్డాయి" అని అధికారి తెలిపారు. అగ్నిమాపక శాఖ శుక్రవారం నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు అగ్నిమాపక భద్రతా వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతోంది. కార్యక్రమాలలో పోస్టర్ల విడుదల, రక్తదాన శిబిరాలు, స్మారక దినోత్సవ కవాతు, ఫైర్ డ్రిల్స్, ప్రథమ చికిత్స, సెమినార్లు ఉన్నాయి.