తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రోజువారి వారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,22,143 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 5,926 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కి చేరింది.
నిన్న ఒక్క రోజే 18 మంది మృత్యువాత పడగా.. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,856కి చేరింది. నిన్న 2,209 మంది బాధితులు కోలుకోగా.. మొత్తంగా ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,16,650 మందికి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 87.62 శాతం, మరణాల రేటు 0.51శాతం ఉందని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో 793 కేసులు నమోదు అయ్యాయి.