తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 1,26,325 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 4,446 పాజిటివ్ నమోదు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,331కి చేరింది.
కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 598, రంగారెడ్డి జిల్లాలో 326, నిజామాబాద్‌లో 314 చొప్పున ఉన్నాయి. ఒక్క రోజే 12 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ మహమ్మారి వ్యాప్తి రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1809కి చేరింది. నిన్న 1,414 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,11,008కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,514 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 22,118 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.