తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 72,364 కరోనా శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,157 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,738కి చేరింది. నిన్న ఒక్క రోజే 821 మంది కోలుకుగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,07,499కి చేరింది. కరోనా మహమ్మారి కారణంగా ఒక్క రోజులో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మహమ్మారి రాష్ట్రంలో మొదలైనప్పటికి నుంచి ఇప్పటి వరకు ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడిన వారి సంఖ్య 1,780కి చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలో 361 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 16,892 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,12,53,374కి చేరింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,10,611 మందికి డోస్-1, 3,12,340 మందికి డోస్-2 టీకా ఇచ్చారు. నిన్న ఒక్క రోజు డోస్-1 టీకాను 31,077 మందికి, డోస్-2 టీకాను 2506 మందికి డోస్-2 టీకాను వేశారు.