Lok Sabha Polls: సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో 61.16 శాతం ఓటింగ్

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు సుమారు 61.16 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం యాప్ వెల్లడించింది.

By అంజి  Published on  13 May 2024 1:30 PM GMT
Telangana, vote, Lok Sabha Polls

Lok Sabha Polls: సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణలో 61.16 శాతం ఓటింగ్ 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు సుమారు 61.16 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం యాప్ వెల్లడించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది, కొన్ని చోట్ల ముందుగానే ముగిసింది.

యాదాద్రి భువనగిరి లోక్‌సభ స్థానంలో అత్యధికంగా 72.34 శాతం పోలింగ్ నమోదైంది, హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యల్పంగా 39.17 శాతం పోలింగ్ నమోదైంది. అందిన కొన్ని ఫిర్యాదులపై విచారణ జరుగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు.

బీజేపీ అభ్యర్థి మాధవి లతపై ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ 'ఎక్స్'లో తెలిపారు. బురఖా ధరించిన మహిళా ఓటర్లను వారి ముఖాలు చూపించమని అడగడం ద్వారా వారి గుర్తింపును ఆమె తనిఖీ చేశారనే ఆరోపణ వచ్చింది ఆమెపై.

మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరిగింది. ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకు 39.92 శాతం ఓటింగ్ నమోదైంది. బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి లాస్య నందిత కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

Next Story