'తుపాకులు అప్పగించాలె'.. హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు
ఎన్నికల నేపథ్యంలో వెపన్స్ డిపాజిట్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు
By అంజి Published on 10 Oct 2023 9:33 AM IST'తుపాకులు అప్పగించాలె'.. హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు
ఎన్నికల నేపథ్యంలో వెపన్స్ డిపాజిట్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో నివసిస్తున్న ఆయుధాల లైసెన్స్ కలిగి ఉన్న వారందరూ వారి వారి ఆయుధాలను ఈనెల 16వ తేదీ లోపు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సెక్యూరిటీ సిబ్బంది మినహా మిగతా వారందరూ వారి వెపన్స్ తప్పని సరిగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో హైదరాబాదు నగరంలోని జాతీయబ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతాసిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు, డిసెంబర్ మూడో తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికలు సవ్యంగా సాగడానికి శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలకు, హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ముందుస్తు జాగ్రత్తగా వెపన్స్ కలిగిన వారందరూ సమీప పోలీస్ స్టేషన్‌లో సబ్మిట్ చేయాలంటూ చెప్పారు. ఒకవేళ ఎవరైనా వెపన్స్ సబ్మిట్ చేయకుంటే అట్టివారిపై చర్యలు తప్పవని సీపీ ఆనంద్ హెచ్చరించారు. అలాగే సబ్మిట్ చేసిన వెపన్స్ ని డిసెంబర్ 10వ తేదీ తర్వాత తీసుకోవచ్చునని వెల్లడించారు.
ఆయుధాలచట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం.. కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ, లైసెన్సు తుపాకులు కలిగి ఉన్నవారంతా సమీపంలోని పోలీసుస్టేషన్‌లో డిపాజిట్ చేయాలి. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేస్తారు.