తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం బుధవారం విడుదల చేసిన ఎన్నికల తుది జాబితా ప్రకారం.. తెలంగాణలో మొత్తం 3,26,18,205 ఓటర్లు, ఇందులో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,705 మంది స్త్రీలు, 2,676 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 15,406 మంది, విదేశాలలో ఉంటున్న 2,944 మంది కూడా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,99,667 మంది యువ ఓటర్లు (18-19 ఏళ్ల వయస్సు) ఉన్నారు. వీరిలో 90 శాతం మంది తొలిసారిగా ఓటు హక్కును ఈ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. ఇది మొత్తం ఓటర్లలో 3.06 శాతం.
అంతే కాకుండా, రాష్ట్రంలో 4,40,371 మంది సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడినవారు) కూడా ఉన్నారు. పీడబ్ల్యూడీ ఓటర్ల సంఖ్య 5,06,921గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. శేరిలింగంపల్లిలో 7,32,560 మంది ఓటర్లు ఉన్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం. భద్రాచలంలో అత్యల్పంగా 1,48, 713 మంది ఓటర్లు ఉన్నారు. నవంబర్ 30, 2023న పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌లో కౌంటింగ్ జరుగుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్ కేంద్రం, బూత్‌ల వివరాలతో కూడిన ఓటర్ స్లిప్‌లను ఎన్నికల అధికారులు బుధవారం పంపిణీ చేశారు. ఓటర్ స్లిప్‌లతో పాటు ఓటరు గైడ్ బుక్‌లెట్ ఓటింగ్ ప్రక్రియ, వినియోగంలో అర్హత గల పత్రాలు, పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు, అభ్యర్థుల వివరాల సమాచారాన్ని అందిస్తున్నారు. ఇతర వివరాలను VOTERS.CCI.GOV.IN వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.