కాంగ్రెస్ తుది జాబితా విడుదల.. నేడు కామారెడ్డికి రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది.
By అంజి Published on 10 Nov 2023 6:26 AM ISTకాంగ్రెస్ తుది జాబితా విడుదల.. నేడు కామారెడ్డికి రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు పేర్లు ఉన్నాయి. కట్టా శ్రీనివాస్ గౌడ్, మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్, బత్తుల లక్ష్మా రెడ్డి, రామారెడ్డి దామోదర్ రెడ్డి, మందుల శామ్యూల్. పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నీలం మధు ముదిరాజ్ స్థానంలో కట్టా శ్రీనివాస్‌గౌడ్‌కు టిక్కెట్ ఇచ్చారు. చార్మినార్ నుంచి కమహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట నుంచి రామారెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి నుంచి మందుల శామ్యూల్ పోటీ చేయనున్నారు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలకు 118 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది.
తన కూటమి భాగస్వామ్య పక్షమైన సీపీఐకి ఒక్క సీటును వదిలిపెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇదిలా ఉంటే.. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ వేయనున్న రేవంత్.. ఆర్వో ఆఫీసుకు భారీ ర్యాలీతో వెళ్లనున్నారు. నామినేషన్ వేసిన అనంతరం కామారెడ్డిలో టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు బీసీ డిక్లరేషన్ సభ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య హాజరుకానున్నారు.
Congress releases a list of five candidates for the upcoming elections in Telangana. pic.twitter.com/GNv4UFpFmK
— ANI (@ANI) November 9, 2023