సీఎం రేవంత్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్

హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతోంది.

By Srikanth Gundamalla
Published on : 28 July 2024 1:30 PM IST

Telangana, politics, central minister bandi Sanjay, comments,  cm revanth reddy,

సీఎం రేవంత్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్

హైదరాబాద్ నగరంలో బోనాల సందడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే భక్తులు అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ.. మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్వించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. అక్బరుద్దీన్‌ ఓవైసీ, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం ఉందని అన్నారు. వారు అధికారంలో ఏ పార్టీ ఉంటే వారికి జై కొడుతారని విమర్శించారు. కొడంగల్‌లో అక్బరుద్దీన్ పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని అన్నారు బండి సంజయ్.

సీఎం రేవంత్‌కు దమ్ముంటే అక్బర్‌ను కాంగ్రెస్ టికెట్‌పై కొడంగల్‌లో పోటీచేయించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌కు కూడా ఆయన కౌంటరిచ్చారు. అక్బరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరితే కొడంగల్ నుంచి గెలిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారన గుర్తు చేశారు. ఆయనకు ధీటుగా బీజేపీ నుంచి కొడంగల్‌లో ఖతర్నాక్‌ అభ్యర్థిని నిలబెడతామని అన్నారు. ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను ఇంచార్జ్‌గా నియమిస్తామని, కొడంగల్‌లో అక్బరుద్దీన్‌కు డిపాజిట్ రాకుండా చూసే బాధ్యత తమదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

మరోవైపు బోనాల కోసం హైదరాబాద్‌లోని ఆయా ఆలయాల వద్ద పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. లాల్‌ దర్వాజా అమ్మవారి బోనాల్లో భాగంగా.. మొదటి రోజు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. రెండో రోజు రంగం భవిష్యవాణి, పోతరాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు ఉంటుంది. 500 కు పైగా పోలీసుల బందోబస్తు, ఆలయంచుట్టు సీసీ కెమెరాల నిఘా ఉంది.

Next Story