ఆ 2 లక్షల జాబ్స్ ఎక్కడ.. బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది!
ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.
By M.S.R Published on 28 Jun 2024 10:00 AM ISTఆ 2 లక్షల జాబ్స్ ఎక్కడ.. బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలను కల్పించాలని, ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించాలని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు చేసిందని.. అయితే వాటిని అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. నిరుద్యోగ యువత తనను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైతే నిరుద్యోగుల పక్షాన బీఆర్‌ఎస్ నాయకులు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైతే నిరుద్యోగులే ప్రభుత్వ పతనానికి కారణమవుతారని ఆయన హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్‌లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ 2లో 2వేలు, గ్రూప్ 3లో మరికొన్ని వేల ఉద్యోగాలు పెంచుతామని హామీ ఇచ్చారని.. అయితే తెలంగాణ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ఉద్యోగాల పెంపు డిమాండ్లను నెరవేర్చకుండా సాకులు చూపుతున్నారని విమర్శించారు.