ఇన్‌స్టంట్ డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్‌లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసులు.. 5 నిమిషాల్లో రిజల్ట్
డ్రంకెన్ డ్రైవింగ్ టెస్ట్ తరహాలో కేవలం ఐదు నిమిషాల్లోనే ఫలితాలను ఇచ్చే కొత్త ఇన్‌స్టంట్ డ్రగ్ డిటెక్షన్ టెస్ట్‌లను తెలంగాణ పోలీసులు తాజాగా ప్రవేశపెట్టారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 Jan 2024 8:05 AM GMTఇన్‌స్టంట్ డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ కిట్‌లను ప్రవేశపెట్టిన తెలంగాణ పోలీసులు.. 5 నిమిషాల్లో రిజల్ట్
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి పోలీసులు చాలా ప్రణాళికలను రచిస్తూ ఉన్నారు. డ్రంకెన్ డ్రైవింగ్ టెస్ట్ తరహాలో కేవలం ఐదు నిమిషాల్లోనే ఫలితాలను ఇచ్చే కొత్త ఇన్‌స్టంట్ డ్రగ్ డిటెక్షన్ టెస్ట్‌లను తెలంగాణ పోలీసులు తాజాగా ప్రవేశపెట్టారు. తెలంగాణా పోలీసు శాఖకు చెందిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TANB) అనుమానితులు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే పరీక్షలను వేగవంతం చేయడంలో సహాయపడటానికి ABON (యూరిన్ కిట్), డ్రాగర్‌లను ప్రవేశపెట్టింది. ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో, మూత్ర పరీక్ష ద్వారా 19 రకాల మందులను గుర్తించవచ్చు. అనుమానితుడు ఏదైనా నార్కోటిక్ పదార్థాన్ని సేవించినట్లయితే సలైవా(లాలాజల) పరీక్ష ద్వారా ఏడు రకాల డ్రగ్స్ ను తీసుకున్నారో లేదో కనిపెట్టేయవచ్చట. ఇప్పటికే కొంత మందిపై ఈ పరీక్షలు నిర్వహించారు. ఇలాంటి 9 కేసుల్లో డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో ఇకపై డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
TSANB డైరెక్టర్ సందీప్ శాండిల్య న్యూస్ మీటర్ తో మాట్లాడుతూ.. “అంతకు ముందు డ్రగ్స్ కేసుల్లో, అనుమానితుల మూత్రం, లాలాజలం సేకరించి ప్రయోగశాలకు పంపిస్తూ ఉండేవాళ్ళం. నివేదికలు రావాలంటే రెండ్రోజులు పడుతుంది. అలాగే, అనుమానితులు తక్షణ పరీక్షల నుండి తప్పించుకుంటారని కూడా కనుగొన్నాం. శరీరం నుండి డ్రగ్స్ బయటకు వెళ్లిన తర్వాత కొందరు పరీక్షకు హాజరవుతూ ఉంటారు. ABON యూరిన్ కప్, డ్రాగర్‌ల ద్వారా నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ఫలితాలు తక్షణమే వస్తుంటాయి. ఒక వ్యక్తిని పరీక్షించడానికి అధికారులకు ప్రత్యేక అనుమతి అవసరం లేదు. కీలకమైన ఇన్‌పుట్‌ల ఆధారంగా, ఏ ప్రదేశంలోనైనా వ్యక్తులను పరీక్షించడానికి అధికారులకు అవకాశం ఉంటుంది. ఇది డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్షల మాదిరిగానే ఉంటుంది. ఫలితాల తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ” అని అన్నారు.
ఒలింపిక్స్, ఇతర అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ లు వంటి టోర్నమెంట్‌లలో ఉపయోగించే పరికరాల లాగానే ఈ టెస్టింగ్ పరికరాలు కూడా ఉంటాయి.
ఎలా పని చేస్తుంది?
ABON యూరిన్ కప్ టెస్ట్ కిట్ అనేది పలు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని తెలియడం కోసం మూత్ర-ఆధారితంగా చేసే పరీక్ష. ఇది మనిషి మూత్రంలో డ్రగ్స్, ఇతర వాటిని గుర్తించడానికి చేసే వేగవంతమైన వన్ స్టెప్ స్క్రీన్ పరీక్ష. ఈ డ్రగ్స్ గుర్తింపు కోసం ఈ యూనిట్‌ను ఉపయోగించవచ్చు.
అంఫేటమిన్ (AMP)
బార్బిట్యురేట్స్ (BAR)
బెంజోడియాజిపైన్స్ (BZO)
బుప్రెనార్ఫిన్ (BUP)
కొకైన్ (COC)
గంజాయి (THC)
మెథడోన్ (MTD)
మెథాంఫేటమిన్ (MET)
మిథిలిన్ డయాక్సిన్ మెథాంఫేటమిన్ (MDMA)
మార్ఫిన్ (MOP)
ఓపియేట్ (OP)
ఆక్సికోడోన్ (OXY)
ఫెన్సైక్లిడిన్ (PCP)
ప్రొపోక్సీఫేన్ (PPX)
ట్రైసైక్లిక్ యాంటిడిప్రెసెంట్స్ (TCA)
ట్రామాడోల్ (TRA)
కెటామైన్ (KET)
కోటినిన్ (COT)
ఫెంటానిల్ (FTY)
ఉపయోగించడం ఎలా?
కప్పుకు ఉన్న సీల్ ను మొదట తీసి వేయాల్సి ఉంటుంది.
కప్ క్యాప్ మధ్యలో నుండి ట్విస్ట్ చేయడం ద్వారా కీని తీసివేయవచ్చు.
కప్‌లోకి నమూనాలను సేకరించాలి. క్యాప్ తో మూసి వేయాలి. క్లిక్ వినిపించే వరకు పుల్ ట్యాబ్‌పై గట్టిగా నొక్కాలి.
నమూనాను సేకరించిన తర్వాత 4 నిమిషాల వరకు ఉష్ణోగ్రత ని తనిఖీ చేయండి. మూత్రం నమూనా ఉష్ణోగ్రతను తెలియజేసేలా ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది.
పరీక్షను ప్రారంభించడానికి కప్పును చదునైన ఉపరితలంపై ఉంచాలి. కీని సాకెట్‌లోకి వేయాలి.
పరీక్ష ఫలితాన్ని కవర్ చేసే లేబుల్ పై స్ట్రిప్ ను తీసివేయాలి. స్ట్రిప్‌ను 3-5 నిమిషాల మధ్య వస్తాయి.
డ్రగ్ స్ట్రిప్ ఫలితాలను 5 నిమిషాల తర్వాత చదవండి. ఔషధ స్ట్రిప్ ఫలితాలు 60 నిమిషాల వరకు స్థిరంగా అలాగే ఉంటాయి.
ఫలితాల వివరణ:
నెగటివ్: కంట్రోల్ లైన్ రీజియన్ లో (C), నిర్దిష్ట డ్రగ్ కోసం టెస్ట్ లైన్ రీజియన్ లో (T) కలర్ లైన్ ఉంటే నెగటివ్ ఫలితాన్ని సూచిస్తాయి.
పాజిటివ్: కంట్రోల్ లైన్ రీజియన్ లో (C) రంగు రేఖ, కానీ నిర్దిష్ట డ్రగ్స్ తీసుకుని ఉన్నట్లయితే టెస్ట్ లైన్ ప్రాంతంలో (T) దగ్గర పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తుంది.
కేస్ స్టడీ:
హైదరాబాద్‌లో, రోడ్డుపై వాగ్వివాదం తర్వాత ఒక వ్యక్తి మరొకరి బొటనవేలును కొరికిన ఘటనను TSANB ఇటీవల కనుగొంది. అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు అతడికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారు. డ్రాగర్ సహాయంతో లాలాజలాన్ని సేకరించి, అతను డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో అతడిపై కేసు నమోదైంది.
డ్రాగర్: డ్రగ్ చెక్ 3000 కిట్
డ్రాగర్ డ్రగ్ చెక్ 3000 కిట్ అనేది ఒక వ్యక్తి కొన్ని డ్రగ్స్ తీసుకున్నట్లయితే నిమిషాల్లో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. కాంపాక్ట్, లాలాజలం (నోటి ద్రవం) ఆధారిత ఔషధ పరీక్ష నమ్మదగినది.. చాలా సులువైనది. డ్రగ్ చెక్ 3000 టెస్ట్ కిట్‌తో, మీరు ఏకకాలంలో ఆరు పదార్ధాలకు సంబంధించిన విషయాలను పరీక్షించవచ్చు. ఈ పరీక్ష ద్వారా ఈ 7 పదార్థాలను గుర్తించవచ్చు:
కొకైన్
ఓపియేట్స్
అంఫేటమిన్
మెథాంఫేటమిన్
బెంజోడియాజిపైన్స్
ఆక్సికోడోన్ మరియు
గంజాయి
జాబితా చేసిన అన్ని పదార్ధాల తరగతులలో, గంజాయి చాలా తరచుగా వినియోగించబడే ఔషధం. దీన్ని గుర్తించడం అన్ని సమయాలలో చాలా కష్టం. అందుకే, THCని గుర్తించడానికి డ్రాగర్ డ్రగ్ చెక్ 3000 ఆప్టిమైజ్ చేశారు. ఈ మొత్తం డ్రగ్స్ టెస్ట్ కు 3-5 నిమిషాలు మాత్రమే పడుతుంది.
ఎలా పరీక్షలు చేయాలి:
శాంప్లర్ సాయంతో లాలాజల నమూనాను తీసుకోండి.
ఫన్నెల్ ఓపెనింగ్‌లో నమూనాను పెట్టాలి.
టెస్ట్ కిట్‌ను షేక్ చేయాలి.
పరీక్ష విశ్లేషణను ప్రారంభించాలి.
పరీక్ష ఫలితాన్ని చదవాలి.
డ్రాగర్ డ్రగ్ చెక్ యాప్‌తో డ్రగ్ గుర్తింపును తెలుసుకోవచ్చు.
డ్రగ్ టెస్ట్: నమూనాలను సులభంగా, సురక్షితంగా పొందవచ్చు
డ్రాగర్ డ్రగ్ చెక్ 3000 రెండు భాగాలను కలిగి ఉంటుంది. లాలాజల నమూనాను పొందేందుకు ఒక పరిశుభ్రమైన నమూనాల కొలేటర్.. విశ్లేషణ కోసం ఒక టెస్ట్ క్యాసెట్. టెస్ట్ క్యాసెట్‌లో బఫర్ లిక్విడ్, కంట్రోల్, టెస్ట్ లైన్‌లను ప్రదర్శించే రెండు టెస్ట్ స్ట్రిప్‌లతో కూడిన విండో కూడా ఉన్నాయి.
డ్రగ్ టెస్ట్ ను మూడు సులభమైన దశల్లో నిర్వహిస్తారు: లాలాజల నమూనాను శుభ్రపరచడం, టెస్ట్ ను కదిలించడం, మార్పులు వచ్చే వరకూ వేచి ఉండి, ఆపై పరీక్షను ప్రారంభించడం. పరీక్ష కోసం తగినంత లాలాజలాన్ని గ్రహించిన వెంటనే రంగు సూచిక అదృశ్యమవుతుంది.
కంట్రోల్ లైన్స్ కనిపించాక ఫలితాలను తెలుసుకోవచ్చు:
నెగటివ్: సంబంధిత పదార్ధాలతో పాటుగా ఒక లైన్ కనిపిస్తుంది. దీని అర్థం నమూనాలో డ్రగ్స్ లాంటి పదార్థాలు ఏవీ కనుగొనలేదు.
పాజిటివ్: పదార్థ తరగతులలో ఒకదాని పక్కన ఒక లైన్ కనిపించకపోతే, ఈ పదార్ధం వినియోగానికి సంబంధించిన ఫలితం సానుకూలంగా ఉంటుంది.
సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య నేతృత్వంలోని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100 మంది అధికారులు ఉన్నారు. ప్రాంతీయ నార్కోటిక్ నియంత్రణ కేంద్రం కోసం ప్రత్యేక పోలీసు బృందం పని చేస్తుంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, వరంగల్ జిల్లాల్లో ఆఫీసులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 300కు చేర్చాలని డిపార్ట్‌మెంట్ యోచిస్తోంది. గతంలో ఈ విభాగానికి హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వం వహించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించారు.