తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్ గుడిమల్ల కన్నుమూశారు. గత కొంత కాలంగా భరత్ భూషణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సచివాలయం సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమయించి ఆదివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. తెలంగాణకు చెందిన భరత్ భూషణ్ సామాజిక స్పృహ కలిగిన మేటి ఫొటోగ్రాఫర్‌గా ఖ్యాతికెక్కారు. హైదరాబాద్‌లోని నల్లకుంటలో భరత్ నివాసముంటున్నారు. ఆయన ఇంటికి వెళ్తే.. పల్లె అందాల ఫొటోలు మనల్ని మంత్రముగ్దులను చేస్తాయనడంలో ఎటువంటి సందేహాం లేదు.
భరత్ భూషణ్ తీసే ఫొటోలకు ప్రత్యేకంగా క్యాపన్లు అవసరం లేదు.. ఎందుకంటే ఆయన తీసిన ఫొటోలు చూస్తే దాని భావం మనకు ఇట్టే అర్థమవుతుంది. గ్రామీన నేపథ్యంలో ఉండే ఎన్నో ఫొటోలను తన కెమెరాలో బంధించారు భరత్ భూషణ్. 1970వ దశకంలో ఫొటోగ్రాఫక్ వృత్తిలోకి అడుగుపెట్టిన ఆయనన.. గురువు మురళీకృష్ణ దగ్గర ఫొటోగ్రఫీ, పెయింటింగ్ నేర్చుకున్నారు. పలు తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికల్లో ఫొటోగ్రాపర్‌గా భరత్ భూషన్ పని చేశాడు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు.
ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వారా, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని సీఎం అన్నారు. భరత్ భూషణ్ మరణంతో తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.