తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్‌ను ప్రజా భవన్ మార్చింది. ఆ తర్వాత ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వారి వారి సమస్యలను సీఎంకు చెప్పుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో పబ్లిక్ ప్రజావాణికి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అర కిలోమీటరు మే క్యూ ఉంది. మంత్రులు, అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. ప్రజా భవన్ రెండు వైపులా పెద్ద క్యూ లైన్లలో ప్రజలు వేచి ఉన్నారు. దీంతో ఇరు వైపుల భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలోనే నేడు శుక్రవారం కావడంతో తమ సమస్యలను చెప్పుకునేందుకు జనం క్యూ కట్టారు. ప్రజా వాణికి వచ్చే ప్రజల నుంచి మంత్రులు ఫిర్యాదులు స్వీకరించి తదనుగుణంగా సమస్య తీవ్రత బట్టి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్ల సమస్యలపైనే ప్రజలు ప్రజావాణికి తరలి వస్తున్నారు. ప్రజా భవన్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు జనం క్యూలో నిలబడ్డారు. అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజాభవన్ కు వచ్చిన జనాల సమస్యలను అధికారులు ఆన్లైన్ లో నమోదు చేసుకుంటున్నారు.