అర్హులకే ఆసరా పెన్షన్లు.. మంత్రి సీతక కీలక ప్రకటన
తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 14 July 2024 4:54 AM GMTఅర్హులకే ఆసరా పెన్షన్లు.. మంత్రి సీతక కీలక ప్రకటన
తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం అర్హులకే పెన్షన్లు అందజేస్తుందని చెప్పారు. ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పెన్షన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్త లబ్ధిదారుల జాబితాను నవీకరిస్తున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామని ఆమె అన్నారు. సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసకుంటూ పాలనను కొనసాగిస్తున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు.
అనర్హులకు కూడా గత ప్రభుత్వం పెన్షన్లను అందజేసిందని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. పేద కుటుంబాలకు అందాల్సిన ఆసరా పెన్షన్లు దుర్వినియోగం అయ్యాయాని చెబుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ఆసరా పెన్ష్లను తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.5,650 మంది ప్రభుత్వోద్యోగులు తమ రిటైర్‌మెంట్ పెన్షన్ పొందుతూనే.. ఆసరా పెన్షన్ కూడా అందుకున్న జాబితాలో వెల్లడింది.వీరిలో 3,824 మంది చనిపోగా.. మిగతా 1,826 మంది రెండు పింఛన్లు అందుకుంటున్నట్లు తెలిసింది.
కాగా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న పేద వృద్ధులు, వితంతువుల, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు,చేనేత కార్మికులు, రాళ్లు కొట్టేవారు, గీత కార్మికులు , దివ్యాంగులు, హెచ్‌ఐవీ రోగులు, డయాలసిస్, పైలేరియా బాధితులకు ఆసరా పథకం వర్తిస్తుంది. వీరితో పాటు అనర్హులు లబ్ధి పొందారని చెబుతోంది సర్కార్. ఈ క్రమంలోనే వారందరి నుంచి పెన్షన్లను రికవరీ చేసేందుకు సిద్ధం అవుతోంది.