కమలా హారిస్ గెలుపు కోసం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యజ్ఞం
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ విజయం సాధించాలని కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామంలోని వాసులు ప్రత్యేక యజ్ఞం నిర్వహిస్తున్నారు.
By అంజి Published on 5 Nov 2024 12:05 PM ISTకమలా హారిస్ గెలుపు కోసం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యజ్ఞం
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామంలోని వాసులు ప్రత్యేక యజ్ఞం (ఆచారం) నిర్వహిస్తున్నారు. కమలా హారిస్ తల్లి పేరు మీద స్థాపించిన శ్యామలా గోపాలన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు జరిగే ఈ క్రతువులో “శ్రీశ్రీశ్రీ రాజా శ్యామలా దేవి సహిత శత చండీ మహా సుదర్శన యజ్ఞం” జరుగుతోంది. వైస్ ప్రెసిడెంట్ పదవిని అలంకరించిన మొదటి భారతీయ-అమెరికన్, దక్షిణాసియా మహిళ కమలా హారిస్ యూఎస్ అధ్యక్ష ఎన్నికలలో గెలవాలని కోరుకుంటూ ఈ యాగం నిర్వహిస్తున్నారు. హారిస్ తల్లి తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగింది. నవంబరు 5, మంగళవారం నాటికి యాగం 10 రోజులకు చేరింది. ఈ ఆచారాన్ని 40 మంది వేద పండితులు నిర్వహిస్తాస్తున్నారు.
శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నల్ల సురేష్ రెడ్డి ప్రకారం.. శత చండీ మహా సుదర్శన యజ్ఞం సాంప్రదాయకంగా అడ్డంకులను పారద్రోలడానికి, శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆకర్షించడానికి నిర్వహిస్తారు. ''ఏదైనా జరగాలంటే అది భగవంతుని దయతో జరుగుతుంది. నేడు (నవంబర్ 5) 10వ రోజు యాగం. ఈ ఆచారం వల్ల హారిస్‌కి మద్దతు పెరగడం చూశాం. హారిస్ గెలవాలని మేము కోరుకుంటున్నాము'' అని అన్నారు. తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని హారిస్ పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో కూడా ఇలాంటి ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
అధ్యక్షుడు జో బిడెన్ తన వయస్సుపై పెరుగుతున్న ఆందోళనల మధ్య అధ్యక్ష రేసు నుండి వైదొలిగిన తర్వాత, ముఖ్యంగా జూన్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలో అతని పేలవమైన ప్రదర్శన తర్వాత హారిస్ డెమొక్రాటిక్ నామినీగా నామినేట్ అయ్యారు. హారిస్ మొదటి మహిళ, మొదటి నల్లజాతి, మొదటి ఆసియా-అమెరికన్ వైస్ ప్రెసిడెంట్. అధ్యక్షుడిగా ఎన్నికైతే, 59 ఏళ్ల ఆమె అమెరికా అధ్యక్షురాలిగా చరిత్రలో మొదటి మహిళ అవుతుంది. ఒక ప్రధాన రాజకీయ పార్టీ ద్వారా అధ్యక్ష పదవికి నామినేట్ చేయబడిన రెండవ మహిళ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్.