Telangana: ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29న పోలింగ్‌ జరగనుంది.

By అంజి  Published on  11 Jan 2024 12:53 PM IST
Telangana, by election Notification, MLC seats

Telangana: ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసింది. కాగా, రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, అనంతరం 19న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 22 తేదీ వరకు గడువు ఉంటుందని పేర్కొంది.

ఈ నెల 29న పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది. అయితే రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తుండటంతో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్‌ పార్టీకే ఆ సీట్లు దక్కనున్నాయి.

Next Story