తెలంగాణ ప్రభుత్వ బడుల్లో 'జియో' అటెండెన్స్‌

Telangana.. Mobile app to mark attendance of staff in govt schools. హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి

By అంజి  Published on  28 Nov 2022 7:39 AM GMT
తెలంగాణ ప్రభుత్వ బడుల్లో జియో అటెండెన్స్‌

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి మొబైల్‌ యాప్‌ ద్వారా జియో హాజరును అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ (ఎస్‌ఈ వింగ్‌) నిర్ణయించింది. రిజిస్టర్లలో హాజరును గుర్తించే అనాదిగా వస్తున్న విధానానికి స్వస్తి పలికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ, స్థానిక పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. సిబ్బంది మొబైల్ యాప్ ద్వారా తమ హాజరును సమయానికి జియో-అటెండెన్స్‌లో వేయాలి.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన ఆయా జిల్లాల డీఈవోలకు ఆదేశాలిచ్చారు. ఈ జిల్లాల్లోని ప్రభుత్వ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని ఆదేశించారు. బోధన, బోధనేతర సిబ్బంది హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టీచర్లు, సిబ్బంది విధులకు హాజరై సెల్ఫీ తీయగానే ఫొటోతో సరిపోల్చుకొని, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా వారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం స్పెషల్‌గా జియో అటెండెన్స్‌ మొబైల్‌ యాప్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు.

ఇది వరకు ప్రభుత్వ స్కూళ్లలో బయోమెట్రిక్‌ హాజరును అమలు చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2020 మార్చి నుంచి దీనిని నిలిపివేశారు. ఈ విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్‌ హాజరును తప్పనిసరిచేస్తూ ఆగస్టులో ఆదేశాలిచ్చారు. అయితే ఇప్పుడు దీని స్థానంలో ఇప్పుడు జియో అటెండెన్స్‌ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్లు స్కూలుకు హాజరైనప్పుడు, విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఫొటో తీసుకోవాలి. ఇంటర్నెట్‌ పనిచేయకపోయినా ఆఫ్‌లైన్‌లో ఉన్నా వివరాలు నమోదవుతాయి. ఇంటర్నెట్‌ పునరుద్ధరించిన తర్వాత యాప్‌ తీసుకుంటుంది.

Next Story