తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

Telangana MLC Election votes Counting start.తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2021 9:29 AM IST
తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభ‌మైంది. మొత్తం 12 స్థానాల‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో నాలుగు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలోని ఆరు స్థానాలు ఏక‌గ్రీవం కాగా.. మిగిలిన ఆరు స్థానాల్లో శుక్ర‌వారం(డిసెంబ‌ర్ 10న‌) పోలింగ్‌ను నిర్వ‌హించారు. ఈ ఓట్ల లెక్కింపు మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌లకు ప్రారంభమైంది. జిల్లాకో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓట్లు లెక్కిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు కోసం ఆదిలాబాద్‌లో 6, కరీంనగర్‌లో 9 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మిగతా కేంద్రాల్లో 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్రతి రౌండ్‌లో 200 ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు నేప‌థ్యంలో కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా మూడంచెల భ‌ద్ర‌తను ఏర్పాటు చేశారు. అధికార పార్టీ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు, స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. రవీందర్ సింగ్ సాధించే ఓట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story