తెలంగాణ కేబినెట్‌లో శాఖల కేటాయింపు.. ఆర్థిక, ఐటీ మంత్రులు వీరే

తెలంగాణలో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన విడుదల చేశారు

By Srikanth Gundamalla  Published on  9 Dec 2023 10:10 AM IST
telangana, ministers,  departments,

తెలంగాణ కేబినెట్‌లో శాఖల కేటాయింపు.. ఆర్థిక, ఐటీ మంత్రులు వీరే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రేవంత్‌రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అయితే.. వారికి శాఖలను మాత్రం వెంటనే కేటాయించలేదు. మూడ్రోజులు అవుతున్నా శాఖలు కేటాయించకపోవడంతో ఇప్పటి వరకు మంత్రులెవరూ బాధ్యతలూ స్వీకరించలేదు. ఇదే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ అధిష్టానంతో చర్చలు శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిపారు. ఢిల్లీ నుంచి రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చారు.

ఈ క్రమంలోనే శనివారం ఉదయం తెలంగాణలో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన విడుదల చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించారు. కేటీఆర్ స్థానంలో ఐటీశాఖను ఎవరు తీసుకుంటారని ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో ఆ శాఖను మంత్రి శ్రీధర్‌బాబుకి కేటాయించారు. మరో సీనియర్‌ నేత ఉత్తమ్‌కు నీటిపారుదల శాఖను ఇచ్చారు.

మంత్రులు... వారికి కేటాయించిన శాఖల వివరాలు:

భట్టివిక్రమార్క- ఆర్థిక, ఇంధన శాఖ

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి- నీటిపారుదల, పౌరసరఫరాలు

శ్రీధర్‌బాబు- ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాలు

దామోదర రాజనర్సింహ- వైద్య, ఆరోగ్య శాఖ

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి- రోడ్లు భవనాల శాఖ

తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయం, చేనేత శాఖ

జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్‌, పర్యాటక శాఖ

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి- రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ

పొన్నం ప్రభాకర్‌- రవాణా, బీసీ సంక్షేమ శాఖ

సీతక్క- మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్‌ శాఖ

కొండా సురేఖ- అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ

Next Story