లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేది ఒకట్రెండు స్థానాలే: మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను నమ్మడం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 26 Jan 2024 1:15 PM GMTలోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచేది ఒకట్రెండు స్థానాలే: మంత్రి ఉత్తమ్
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. త్వరలోనే అమలు చేస్తామని దీమాగా చెబుతోంది. ఇప్పటికే రెండింటిని అమలు చేశామని.. ఫిబ్రవరి నుంచి మరిన్ని గ్యారెంటీలు అమలు చేయాలని భావిస్తోంది. అదే సమయంలో లోక్‌సభ ఎన్నిలకుకు సమయాత్తం అవుతోంది. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, మన్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ చైర్మన్లపై అవిశ్వాసాలు తీసుకొస్తూ.. వాటిని కైవసం చేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు చెక్‌పెట్టేఆలోచనలో ఉంది. ఈ మేరకు ఇదే అంశంపై మాట్లాడారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను నమ్మడం లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగానే ప్రజల తీర్పు ఉండబోతుందని అన్నారు. ఆ తర్వాత కేసీఆర్ పార్టీ మరింత బలహీనపడుతుందని చెప్పారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 స్థానాలను గెలవనుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకు పరిమితం అవుతుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.
అలాగే..బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు అంతులేని అవినీతికి పాల్పడ్డారని మంత్రి ఉత్తమ్ అన్నారు. వారి అవినీతి చిట్టాను తామే బయటకు తెస్తామని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ మొదలైందన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాన్‌పహాడ్ దర్గా ఉర్సులో శుక్రవారం మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. దర్గా అభివృద్ధి కోసం కోటి రూపాయలను ప్రకటించారు.