Telangana: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట
తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 11:18 AM ISTTelangana: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైకోర్టులో ఊరట
తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక చెల్లందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు పత్రాలు సమర్పించారని హైకోర్టులో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు పిటిషన్ దాఖలు చేశారు. 2019లోనే హైకోర్టులో రాఘవేంద్రరాజు పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్ట విరుద్ధం అని రాఘవేంద్రరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకుగాను ఎమ్మెల్యేగా శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. విచారణలో భాగంగా గతంలో అడ్వకేట్ కమీషన్‌ను హైకోర్టు నియమించగా.. అడ్వకేట్ కమీషన్ ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేరుగా విచారణకు హాజరయ్యారు. అనంతరం అడ్వకేట్ కమిషన్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటి వరకు ఇరు వర్గాల తరఫున వాదనలు హైకోర్టు విన్నది. తాజాగా తీర్పు వెల్లడించింది. శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఎన్నికలకు ముందు హైకోర్టులో ఊరట లభించినట్లు అయ్యింది.