తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అర్హులైన అభ్యర్థుల వివరాలను అధికారికంగా వెల్లడించింది. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ లోపు ఫిర్యాదు చేయవచ్చు. అభ్యంతరాల పరిశీలన అనంతరం బోర్డు ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేస్తుంది. ఎంపికైన కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు మార్చి నెలాఖరు నాటికి విధుల్లో చేరే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
అభ్యంతరాలను కేవలం ఒక్కసారి మాత్రమే సమర్పించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని బోర్డు సూచించింది. ఒకటి కంటే ఎక్కువ ఆధార పత్రాలు ఉంటే వాటిని సింగిల్ PDF ఫైల్‌గా మార్చి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేస్తారు. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలోని వివరాలను అభ్యర్థులు నమోదు చేసినవేనని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో వీటిని బోర్డు క్షుణ్ణంగా పరిశీలిస్తుందని స్పష్టం చేసింది.