సౌదీ అరేబియాలో తెలంగాణ వ్యక్తి మృతి.. విమానం ఎక్కే గంట ముందు విషాదం

భారత్‌కు విమానం ఎక్కాల్సిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సౌదీ విమానాశ్రయంలో గుండెపోటుకు గురై మరణించాడు.

By అంజి
Published on : 22 March 2023 1:16 PM IST

Saudi Arabia airport, heart attack

సౌదీ అరేబియాలో తెలంగాణ వ్యక్తి మృతి.. విమానం ఎక్కే గంట ముందు..

హైదరాబాద్: ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటు సంఘటనలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో ప్రజలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్‌కు విమానం ఎక్కాల్సిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సౌదీ విమానాశ్రయంలో గుండెపోటుకు గురై మరణించాడు. మహ్మద్ చాంద్ పాషాగా గుర్తించబడిన వ్యక్తి, భారతదేశానికి వెళ్లాల్సిన విమానానికి కేవలం గంట ముందు గుండెపోటుతో మరణించాడు. ఈ విషయాన్ని టైమ్స్‌ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది.

తెలంగాణలోని జగిత్యాలలోని కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల పాషా సౌదీ అరేబియాలోని అభా నగరంలో పని చేసేందుకు వెళ్లాడు. మార్చి 2వ తేదీన మరణించిన దాదాపు మూడు వారాల తరువాత, మార్చి 20 న పాషా మరణ వార్త వెలుగులోకి వచ్చింది. సంఘటన వివరాల ప్రకారం.. పాషాకు గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పాషా అంత్యక్రియలు కూడా సౌదీ అరేబియాలోనే జరిగాయని సమాచారం.

Next Story