తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న లులు గ్రూప్
యూఏఈకి చెందిన లులు గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్,
By News Meter Telugu Published on 26 Jun 2023 2:55 PM ISTతెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న లులు గ్రూప్
హైదరాబాద్: యూఏఈకి చెందిన లులు గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ అవుట్‌లెట్‌పై దృష్టి సారిస్తూ 3,500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. సోమవారం హైదరాబాద్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు, ఇతర అధికారులతో లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎ యూసఫ్ అలీ సమావేశమై కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పండ్లు, కూరగాయలు, మినుములు, పప్పులు మరియు సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ను నిర్వహించే అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించింది. అదనంగా, లులు గ్రూప్ గ్లోబల్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను గ్రేడింగ్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి హైదరాబాద్‌లో లాజిస్టిక్స్ హబ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
వరి ఉత్పత్తి, చేపల పెంపకం, పాడి పరిశ్రమ, మాంసం ఉత్పత్తిలో తెలంగాణ విజయం సాధించిందని యూసఫ్ అలీ అన్నారు. “తెలంగాణ సాధించిన విజయాలు నన్ను ఆకట్టుకున్నాయి. కొచ్చిలో మాకు అత్యాధునిక ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది. తెలంగాణలోనూ ఇలాంటి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాం. తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం" అని యూసఫ్ అలీ తెలిపారు.
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తాము కలుసుకున్నామని.. పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రి కేటీఆర్ నిబద్ధతను యూసఫ్ అలీ ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో లులు గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వారి ప్రారంభ పెట్టుబడిలో భాగంగా, లులు గ్రూప్ మంజీరా మాల్‌ను లులు మాల్‌గా రీబ్రాండ్ చేసింది, ఇందుకోసం రూ. 300 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మాల్ ను ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ఓపెన్ చేయనున్నారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా లులు హైపర్‌మార్కెట్ ఉంటుంది. 2,000 మంది వ్యక్తులకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. లులు గ్రూప్ తెలంగాణలో మూడు అదనపు మాల్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది, ఇందులో హైదరాబాద్‌లో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని అనుకుంటూ ఉండగా.. హైదరాబాద్ నగరం శివార్లలోనూ, ఇతర ప్రధాన పట్టణాలలో మినీ మాల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ల కోసం భూమి కేటాయింపులు జరగనున్నాయి.
లులు గ్రూప్ సాధించిన విజయాలపై మంత్రి కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు. విదేశీ కంపెనీలపై ఆసక్తి పెంచుకోవద్దని, భారతీయ కంపెనీలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు సూచించారన్నారు. దేశంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించడం వల్ల పలు రాష్ట్రాలు తెలంగాణ నుండి వరి సరఫరాను కోరుతున్నాయి. పొరుగు రాష్ట్రాలకు మద్దతు ఇస్తామని.. రాజకీయాలకు తావు లేదని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రిటైల్ అవుట్‌లెట్‌ల కోసం 24x7 కార్యకలాపాలను అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లులు గ్రూప్ కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుందని అన్నారు కేటీఆర్. యూఏఈకి చెందిన లులు గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్,