తెలంగాణలో లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఆగస్టు 4 నుంచి 14 వరకు లా సెట్ (యూజీ) రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఆగస్టు 16 నుంచి 17 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆగస్టు 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 22 నుంచి 25 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక పీజీ ఎల్ సెట్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగనుంది. సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
సెప్టెంబర్ 8న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. పీజీ ఈసెట్ (ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్) రిజిస్ట్రేషన్లు ఆగస్టు 1 నుంచి 9 వరకు జరుగుతాయి. వెబ్ ఆప్షన్లు ఆగస్టు 11 నుంచి 12 వరకు నమోదు చేసుకోవాలి. ఆగస్టు 16న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 18 నుంచి 21 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.