హైదరాబాద్: నేటితో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు ముగియనుందని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలిపింది. వృత్తి విద్య, సాధారణ విద్య విద్యార్థులు సహా మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు రూ.2500 ఆలస్య రుసుముతో ఇవాళ ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కాగా ఈ నెల 22 నుంచి 29 వరకు రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు ఈ నెల 20 వరకు ఎడ్ సెట్ దరఖాస్తులకు గడువు పెంచినట్టు అధికారులు తెలిపారు. అధికారిక పోర్టల్ tsbie.cgg.gov.in లో ఫీజు చెల్లించవచ్చు.
ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం తెలంగాణ ఇంటర్ పరీక్షలు మార్చి 6 నుండి మార్చి 25 వరకు జరిగాయి. ఫలితాలు ఏప్రిల్ 24న వెలువడ్డాయి. TSBIE రికార్డుల ప్రకారం.. 11వ తరగతి విద్యార్థులలో 66.89 శాతం మంది, 12వ తరగతి విద్యార్థులలో 71.37 శాతం మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాలలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలు మెరుగ్గా రాణించారు - 57.31 శాతం మంది అబ్బాయిలు 12వ తరగతిలో ఉత్తీర్ణులైతే 74.21 శాతం మంది అమ్మాయిలు 11వ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. 57.83 శాతం మంది అబ్బాయిలు 11వ తరగతిలో ఉత్తీర్ణులైతే 73.83 శాతం మంది అమ్మాయిలు 11వ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు.