కామారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

By Srikanth Gundamalla
Published on : 23 Jun 2024 2:00 PM IST

Telangana, kamareddy , govt teacher, suicide,

కామారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

వీణ అనే ఉపాధ్యాయురాలు బీబీపేట మండలం జనగామ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఈమెకు సిద్ధిపేటకు చెందిన శ్రవణ్‌ కుమార్‌ అనే వ్యక్తితో 2015లో వివాహం అయ్యింది. కొన్నాళ్లు వీరి కాపురం సాఫీగానే ఉన్నా.. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. నిత్యం భర్త తనతో గొడవ పడుతుండటంతో వీణ తట్టుకోలేకపోయింది. రోజూ కుంగిపోతూ ఉండేది. దాంతో.. మనస్పర్ధాల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే మతిస్థిమితం కోల్పోయిన వాణి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీణ సూసౌడ్‌పై తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాగా..ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story