హైదరాబాద్: ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 9, 96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.
నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం నాడు ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు. ఇంటర్ ఫలితాలు నేరుగా బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా ఏపీ ఇంటర్ ఫలితాలు ఈ నెల 12న విడుదలైన సంగతి తెలిసిందే.