తెలంగాణ‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

Telangana Inter Second year results released.తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు నేడు(సోమ‌వారం)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2021 10:50 AM GMT
తెలంగాణ‌లో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు నేడు(సోమ‌వారం) మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. ప‌రీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్ర‌క‌టించారు. 2,28,754 మంది బాలిక‌లు, 2,22,831 మంది బాలురు ఉత్తీర్ణ‌త సాధించారు. వీరిలో 1,76,719 మంది 'ఏ' గ్రేడ్‌... 1,04,888 మంది 'బీ' గ్రేడ్‌ సాధించారు. ఇక 61,887 మంది 'సీ' గ్రేడ్‌ 1,08,093 మంది 'డీ' గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫస్టియర్‌ మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు కేటాయించారు. ఇంటర్‌ సెకండియర్‌ ప్రాక్టికల్స్‌కు వందశాతం మార్కులు ఇచ్చారు. ఫ‌లితాల కోసం.. www.tsbie.cgg.gov.inలో చూడొచ్చ‌ని అధికారులు తెలిపారు.

మార్కుల మెమోలో త‌ప్పులుంటే ఫిర్యాదు చేసేందుకు ఇంట‌ర్ బోర్డు అవ‌కాశం క‌ల్పించింది. టోల్ ఫ్రీ నెంబ‌రు 040 24600110కు ఫోన్ చేసి చెప్పాల‌ని సూచించింది. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోవ‌డంతో ఇంట‌ర్ సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులను ద్వితీయ సంవత్సరంలో కూడా కేటాయిస్తున్నట్లు మార్గదర్శకాలు గతంలోనే విడుదలైన విషయం తెలిసిందే. ప్రథమ సంవత్సరంలో తప్పిన సబ్జెక్ట్లు మరియు ప్రైవేటుగా పీజు కట్టిన విద్యార్థులకు 35 శాతం మార్కులను కేటాయించనున్నారు. ఇక ప్రాక్టిక‌ల్స్‌లో అంద‌రికీ 100 శాతం మార్కులు ఇస్తూ అధికారులు నిర్ణ‌యం తీసుకున్న‌సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it