Telangana: నేడు ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల

ఇంటర్‌ వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచునున్నట్టు అధికారులు తెలిపారు.

By అంజి  Published on  19 Feb 2024 6:33 AM IST
Telangana, inter hall tickets, Inter Exams

Telangana: నేడు ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల

హైదరాబాద్‌: ఇంటర్‌ వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను అందుబాటులో ఉంచునున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు నేరుగా ఈ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ ఏడాది పరీక్షల కోసం 1521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఒక రోజు ఫస్టియర్‌ వారికి, మరోరోజు సెకండియర్‌ వారికి పరీక్షలను నిర్వహిస్తారు.

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్ ఇదే:

28.02.2024 : సెకండ్ లాగ్వేజ్

01.03.2024 : ఇంగ్లీష్

04.03.2024 : మ్యాథ్య్ 1, బోటనీ, పొలిటికల్ సైన్స్ -1

06.03.2024 : మ్యాథ్స్ – 2, జువాలజీ, హిస్టరీ

11.03.2024 : ఫిజిక్స్, ఏకానమిక్స్ -1,

13.03.2024 : కెమిస్ట్రీ, కామర్స్

15.03.2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -1

18.03.2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -1.

ఇంటర్ సెకండీయర్‌ పరీక్షల షెడ్యూల్ ఇదే:

29.02.2024 : సెకండ్ లాగ్వేజ్

02.03.2024 : ఇంగ్లీష్ – 2

05.03.2024 : మ్యాథ్య్ – 2A, బోటనీ – 2, పొలిటికల్ సైన్స్ – 2

07.03.2024 : మ్యాథ్స్ – 2B, జువాలజీ – 2, హిస్టరీ – 2

12.03.2024 : ఫిజిక్స్ – 2, ఏకానమిక్స్ – 2 ,

14.03.2024 : కెమిస్ట్రీ – 2, కామర్స్ – 2

16.03.2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్డి కోర్స్ మ్యాథ్స్ -2

19.03.2024 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్, జియోగ్రఫీ -2.

Next Story