పెళ్లంటే రూ.లక్షలు ఖర్చుపెట్టి వేడుకలు చేసే రోజులివి. కానీ ఈ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందుకు భిన్నంగా పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచారు. ఐపీఎస్ శేషాద్రిని, ఐఏఎస్ శ్రీకాంత్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఎలాంటి ఆడంబరాలకు వెళ్లకుండా ఒక్కటైన ఈ జంటపై ప్రశంసలు కురుస్తున్నాయి.
శేషాద్రిని కుత్బుల్లాపూర్ డీసీపీగా ఉండగా శ్రీకాంత్ ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారు. వీరి వివాహానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉన్నత హోదాల్లో ఉండి కూడా అనవసర ఖర్చులకు తావివ్వకుండా నిరాడంబరంగా వివాహం చేసుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.