తెలంగాణ హైకోర్టులో నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు

By Knakam Karthik
Published on : 31 July 2025 11:49 AM IST

Telangana, TG High Court, Telangana Judges, Supreme Court Collegium

తెలంగాణ హైకోర్టులో నూతనంగా నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ గాడి ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ రామకృష్ణా రెడ్డి, జస్టిస్‌ సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ గౌస్‌ మీరా మొహియుద్దీన్‌తో సీజే జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు. హైకోర్టులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, లాయర్లు హాజరయ్యారు.

హైకోర్టులో లాయర్లుగా ఉన్న ఈ నలుగురిని జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో వారి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న ఆమోదముద్ర వేశారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో జడ్జిల సంఖ్య 30కి చేరింది.

Next Story