ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2024 6:55 AM IST
telangana, high court, sensational judgment  ,

ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021లో రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. దోషి దినేశ్‌ కుమార్‌కు ఉరిశిక్షను ఖరారు చేసింది. 2017 లో నార్సింగి​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన నాలుగున్నరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు విషయంలో 2021 లో రంగారెడ్డి కోర్టు నిందితుడు దినేశ్‌ కుమార్‌ను దోషిగా తేల్చింది రంగారెడ్డి కోర్టు. విచారణ అనంతరం అతనికి ఉరిశిక్షణు విధించింది. దాంతో.. అతను తెలంగాణ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు రంగారెడ్డి కోర్టు విధించిన శిక్షను సమర్ధించింది. దినేశ్‌కు ఉరిశిక్షే సరియైనదని సంచలన తీర్పును వెలువరించింది తెలంగాణ హైకోర్టు.

చాక్లెట్‌ ఆశ చూపి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన దినేష్‌ కుమార్‌ ధార్నే(25)కు ఉరిశిక్ష విధిస్తూ రంగారెడ్డి కోర్టు 2021లో సంచలన తీర్పునిచ్చింది. నార్సింగి పోలీస్‌ స్టేషన్​ పరిధిలో 2017లో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. బాలికపై పాశవికంగా ప్రవర్తించిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని అంతా కోరుకున్నారు. పోలీస్‌ అధికారులు కూడా తక్కువ సమయంలో సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో అభియోగ పత్రాలను సమర్పించారు. అసాధారణ ఘటనగా పరిగణించిన కోర్టు వేగంగా విచారణ పూర్తిచేసి నేరస్థుడు దినేష్‌కు మరణ శిక్షసమంజసమని తీర్పు ఇచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాకు చెందిన దినేష్‌ అక్కడే సెంట్రింగ్‌ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో చనువుగా ఉండేవాడు. 2017.. డిసెంబరు 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి కుమార్తె(5)కు చాక్లెట్ల ఆశ చూపి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. పాప కనపించడం లేదని తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు పరిసర ప్రాంతాల్లో వెదుకుతుండగా నిందితుడు అమాయకత్వం నటిస్తూ వారిని అనుసరించాడు. చివరిసారిగా చిన్నారి.. దినేష్‌ వెంట కనిపించిందనే చిన్న ఆధారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు.లోతుగా విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరిస్తూ జరిగిన ఉదంతాన్ని వెళ్లగక్కాడు.

Next Story