హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్‌లో హైడ్రా సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 27 Sept 2024 7:15 PM ISTహైదరాబాద్‌లో హైడ్రా సంచలనంగా మారింది. అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు. ఇందులో భాగంగా పేదలు కూడా ఇల్లు కోల్పోతున్నారు. దీనిపై రాజకీయంగానూ వివాదం రేగుతోంది. తాజాగా అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన కేసు విసయంలో హైకోర్టు విచారణ చేపట్టింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు.కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.దాంతో.. కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే.. దీనిపై హైడ్రా కమిషనర్ వివరణ ఇవ్వాలని సూచించిన హైకోర్టు.. నేరుగా లేదా ఆన్‌లైన్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.