తెలంగాణ మెడికల్ కాలేజీల్లో స్థానిక రిజర్వేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుని వెలువరించింది.

By Srikanth Gundamalla
Published on : 11 Sept 2023 6:48 PM IST

Telangana, High Court, Medical College, Reservation,

తెలంగాణ మెడికల్ కాలేజీల్లో స్థానిక రిజర్వేషన్‌పై హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుని వెలువరించింది. స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ధర్మాసనం ఈ సందర్భంగా సమర్థించింది. కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకేనని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులనే తాజాగా తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. ఆలిండియా కోటాలో 15 శాతం పోగా... మిగిలినవన్నీ తెలంగాణ వారికేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు జీవో 72ను సవాల్‌ చేస్తూ పలువురు ఏపీ విద్యార్థులు పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. ఆ తర్వాత ఏపీకి చెందిన విద్యార్థుల పిటిషన్‌లను కొట్టివేసింది.

Next Story