హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల పెండింగ్ చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచిపెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంలో వాహనదారులను బలవంతపెట్టొద్దని ట్రాఫిక్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వాహనదారులు చలాన్లు చెల్లించాలని బైక్ కీస్ లాక్కోవడం.. వాహనాన్ని నిలిపివేయడం వంటివి చేయొద్దని పేర్కొంది.
వాహనం ఆపినప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే.. పోలీసులు వసూలు చేసుకొవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనదారులు చెల్లించడానికి ఇష్టపడని పక్షంలో చట్టప్రకారం కోర్టు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. అంతేకానీ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని బలవంతపెట్టొద్దని తెలిపింది.