టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. సీఎస్‌కు హైకోర్టు నోటీసులు

Telangana High Court issued notices to CS Someshkumar and Sarfaraj.తెలంగాణ హైకోర్టులో నేడు(గురువారం) టాలీవుడ్ డ్ర‌గ్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2022 7:55 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. సీఎస్‌కు హైకోర్టు నోటీసులు

తెలంగాణ హైకోర్టులో నేడు(గురువారం) టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఈడీ దాఖ‌లు చేసిన కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిగింది. ఈ క్ర‌మంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు న్యాయ‌స్థానం నోటీసులు జారీ చేసింది. దీనిపై 10 రోజుల్లోగా వివ‌రణ ఇవ్వాల‌ని ఆదేశించింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 25కు వాయిదా వేసింది హైకోర్టు.

కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వడం లేదని ఈడీ ఆరోపించింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపింది. ఈడీ సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కోర్టు ధిక్కరణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైకోర్టులో ఈడీ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

Next Story
Share it