కేటీఆర్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. దూకుడు పెంచిన ఏసీబీ

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్‌ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

By అంజి  Published on  7 Jan 2025 11:27 AM IST
Telangana High Court, quash petition, KTR

కేటీఆర్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. దూకుడు పెంచిన ఏసీబీ

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఫార్ములా ఈ కార్‌ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని.. చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. అందరికి రూల్‌ ఆఫ్‌ లా ఒకేలా వర్తిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. కేటీఆర్‌ అరెస్ట్‌పై కూడా స్టే ఎత్తివేసింది. దీంతో ఏసీబీ విచారణలో పూర్తి స్థాయిలో దూసుకుపోతుంది.

10 రోజుల పాటు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలంటూ కేటీఆర్ లాయర్ల మౌఖిక అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డర్ కాపీ అందుబాటులో ఉంటుంది. ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి ఏసీబీ పలు చోట్ల సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌, విజయవాడలోనూ గ్రీన్‌ కో, ఏస్‌ జెన్‌నెక్ట్స్‌ ఆఫీసుల్లో రికార్డులు పరిశీలిస్తోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో నేడు విచారణకు హాజరు కాలేనని కేటీఆర్‌ తెలపగా ఏసీబీ అనుమతి ఇచ్చింది. జనవరి 9న ఏసీబీ ఎదుట హాజరుకావాలని కేటీఆర్‌ను ఆదేశించింది

Next Story