సీఎస్ సోమేశ్ కుమార్‌కు షాక్‌.. ఏపీ క్యాడ‌ర్‌కు వెళ్లాల‌ని హైకోర్టు ఆదేశం

Telangana HC Shock to CS Somesh Kumar.తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jan 2023 6:17 AM GMT
సీఎస్ సోమేశ్ కుమార్‌కు షాక్‌.. ఏపీ క్యాడ‌ర్‌కు వెళ్లాల‌ని హైకోర్టు ఆదేశం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. తెలంగాణ‌కు సోమేశ్ కుమార్ కేటాయింపును ర‌ద్దు చేస్తూ కీల‌క తీర్పు నిచ్చింది. గ‌తంలో కేంద్ర ప‌రిపాల‌న ట్రెబ్యున‌ల్‌(క్యాట్‌) ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను ఉన్న‌త న్యాయ‌స్థానం కొట్టివేసింది. సోమేశ్ కుమార్ ఏపీ క్యాడ‌ర్ వెళ్లాల‌ని సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ బెంచ్ తీర్పు వెలువ‌రించింది.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేటాయించింది. దీనిపై ఆయ‌న కేంద్ర ప‌రిపాల‌న ట్రిబ్యున‌ల్‌(క్యాట్‌)ను ఆశ్ర‌యించారు. కేంద్రం ఉత్వ‌ర్తులు నిలిపివేసి ఆయ‌న తెలంగాణ‌లో కొన‌సాగేలా క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఉత్త‌ర్వుల‌తో ఆయ‌న తెలంగాణ‌లో కొన‌సాగుతున్నారు. క్యాట్ ఉత్త‌ర్వుల‌ను కొట్టివేయాల‌ని కేంద్రం 2017లో హైకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం మంగ‌ళ‌వారం తుది తీర్పును వెల్ల‌డించింది. సోమేష్ కుమార్ అభ్యర్థన మేరకు తీర్పు అమలును 3 వారాలు నిలిపివేశారు.

కాగా.. డిసెంబ‌ర్ 2019 నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొన‌సాగుతున్నారు.

Next Story