బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కొడుకుపై ఉన్న హిట్ అండ్ రన్ కేసులో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. 2023 ప్రమాదానికి సంబంధించిన కేసులో అతను విచారణను ఎదుర్కోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా ఈ కేసు 2023 డిసెంబర్ 23న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని ప్రజా భవన్ సమీపంలో వేగంగా వస్తున్న BMW కారు ట్రాఫిక్ డివైడర్లు, బారికేడ్లను ఢీకొట్టింది. ఆ వాహనాన్ని షకీల్ కుమారుడు సాహిల్ నడిపినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని పోలీసులు నిర్ధారించారు. అయితే అక్కడున్న సీసీటీవీలో ప్రమాద దృశ్యాలు రికార్డు అయ్యాయి. ప్రమాదం తర్వాత సాహిల్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాహిల్‌ను చట్టపరమైన చర్యల నుండి రక్షించడానికి అతని స్థానంలో అబ్దుల్ ఆసిఫ్ అనే మరో వ్యక్తిని డ్రైవర్‌గా నియమించడానికి ప్రయత్నాలు జరిగాయని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. ఈ కేసును కప్పిపుచ్చడంలో షకీల్, అబ్దుల్ ఆసిఫ్, కొంతమంది పోలీసు సిబ్బంది పాత్రపై కేసులు నమోదు చేశారు.